Boinpalli: బోయిన్‌పల్లిలో అక్రమ మొరం టిప్పర్ సీజ్.. డ్రైవర్ అరెస్ట్!
Boinpalli: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వెంకట్రావుపల్లి వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Boinpalli: బోయిన్‌పల్లిలో అక్రమ మొరం టిప్పర్ సీజ్.. డ్రైవర్ అరెస్ట్!
రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయిన్పల్లి మండలం వెంకట్రావుపల్లి వద్ద పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. TS 30 T 4878 నంబర్ గల టిప్పర్ ఎలాంటి అనుమతులు లేకుండా మొరం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా సరైన పత్రాలు లేకపోవడంతో టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ బొజ్జ అఖిల్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు బోయిన్పల్లి ఎస్సై రమాకాంత్ తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ మరియు అనుమతులు లేకుండా ఖనిజాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, ఇటువంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




