సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడికి యత్నం.. ఉద్రిక్తత!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేవైఎం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి పిలుపుతో ఉద్రిక్తత.

KALEEM, SIRICILLA
Published on: 27 July 2026 11:34 AM IST
సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడికి యత్నం.. ఉద్రిక్తత!
X

రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా అప్రమత్తమయ్యారు. కార్యక్రమానికి ముందుగానే పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండే కార్యాలయమని, అయితే ప్రజలకు అందుబాటులో లేకుండా ఉందని ఆరోపించారు. క్యాంపు కార్యాలయాన్ని సందర్శించి ప్రజలకు వాస్తవ పరిస్థితులను తెలియజేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టగా, పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి అడ్డుకున్నారని విమర్శించారు.

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును హరించడం సరికాదని ఆయన పేర్కొంటూ, సిరిసిల్ల ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు, చట్టం-శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపినట్లు సమాచారం.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story