Sircilla: సిరిసిల్లలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ ఒకరోజు దీక్ష!
Sircilla: సిరిసిల్లలో బీజేపీ ఒకరోజు దీక్ష. 15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని జిల్లా అధ్యక్షుడు గోపి డిమాండ్.
Sircilla: సిరిసిల్లలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ ఒకరోజు దీక్ష!
Sircilla: తెలంగాణ రాష్ట్రంలో 120 రకాల హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మండిపడ్డారు.
సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేసే వరకు ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా “ఫీజుల బకాయి–బీజేపీ లడాయి” పేరుతో విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిలిపివేసి విద్యార్థులను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో జన్‌జీ అంటూ రాహుల్ గాంధీ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు.
గత ప్రభుత్వం రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిలిపివేస్తే, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే విధంగా విద్యార్థులను మోసం చేస్తోందని విమర్శించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థులందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. వర్షాకాలంలోగా ఫీజు బకాయిలను విడుదల చేయకపోతే సిరిసిల్ల నుంచి శంఖారావం పూరిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.




