Karimnagar: పోలీసుల అడ్డుకావాల మధ్య బీజేపీ నాయకుల అరెస్ట్!

Karimnagar: కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో బీజేపీ 'ఫీజు బకాయి - బీజేపీ లడాయి' నిరసన ఉద్రిక్తం. ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నాయకుల అరెస్ట్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 29 Aug 2026 1:54 PM IST
Karimnagar
X

Karimnagar: పోలీసుల అడ్డుకావాల మధ్య బీజేపీ నాయకుల అరెస్ట్!

Karimnagar: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 'ఫీజు బకాయి - బీజేపీ లడాయి' ప్రోగ్రాంలో భాగంగా కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో బీజేపీ జిల్లా శాఖ నిరసన కార్యక్రమం చేపట్టింది.

ఈ సందర్భంగా ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించిన పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అయినప్పటికీ, పోలీసుల భారీ మోహరింపు మధ్య నాయకులు, కార్యకర్తలు ఎట్టకేలకు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, బకాయిలు ఇచ్చేవరకూ పోరాటం ఆపేది లేదని నాయకులు స్పష్టం చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story