Sircilla: బాలాజీ స్వీట్ హౌస్ సీజ్.. లక్ష రూపాయల జరిమానా!

Sircilla: తినుబండారాలలో బల్లి పడి చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్‌ను సీజ్ చేసి రూ.లక్ష ఫైన్ వేశారు.

KALEEM, SIRICILLA
Published on: 1 July 2026 6:00 PM IST
Sircilla
X

Sircilla: బాలాజీ స్వీట్ హౌస్ సీజ్.. లక్ష రూపాయల జరిమానా!

సిరిసిల్ల: ఆహార భద్రత విషయంలో స్థానిక బాలాజీ స్వీట్ హౌస్ లో నిన్నటి రోజు తినుబండారాలలో బల్లి పడగా అవి తిన్న చిన్నారులు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈరోజు తనిఖీకి వచ్చిన జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష.

మీడియా అడిగిన ప్రశ్నలకు పూర్తిగా సమాధానం చెప్పకుండా వెను తిరిగిన ఫుడ్ ఇన్స్పెక్టర్.

జిల్లాలో మంగళవారం కలకలం రేపిన తిరుబండారంలో బల్లి పడగా స్థానిక బాలాజీ స్వీట్స్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు మున్సిపల్ అధికారులతో కలిసి తయారీ కేంద్రంతోపాటు స్వీట్ హాజను సీజ్ చేశారు. దీంతోపాటు లక్ష రూపాయలు ఫైన్ వేసినట్టు తెలిపారు.

సిరిసిల్లలో చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, తినిబండారాలు, తోపుడు బండ్లు,టిఫిన్ సెంటర్లు ఇవన్నీ ఉన్నాకానీ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు అంటూ ప్రశ్నించిన సామాన్య ప్రజలు. ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికుల నిలదీత.

మీడియాతో పాటు సామాన్య ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నిర్లక్ష్య వైఖరితో తాళం వేసిన స్వీట్ హౌస్ కు కనీసం ఎటువంటి ప్రభుత్వ ముద్రతో కూడినటువంటి సీజ్ లేకుండా వెళ్లిపోయిన ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story