Karimnagar: పరిశుభ్రతపై పాఠం.. బూరుగుపల్లి విద్యార్థులకు చెత్త వర్గీకరణపై అవగాహన!
Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాలలో తడి చెత్త, పొడి చెత్త వర్గీకరణపై అవగాహన కార్యక్రమం జరిగింది.
Karimnagar: పరిశుభ్రతపై పాఠం.. బూరుగుపల్లి విద్యార్థులకు చెత్త వర్గీకరణపై అవగాహన!
కరీంనగర్ జిల్లా: గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలోని ప్రభుత్వ హై స్కూల్‌లో విద్యార్థులకు తడి చెత్త, పొడి చెత్త వర్గీకరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెత్తను సరిగ్గా వేరు చేయడం ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమంలో వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో ధమ్మని రాము మాట్లాడుతూ, ఇంటి వద్దనే తడి చెత్త (ఆహార అవశేషాలు, కూరగాయల ముక్కలు) మరియు పొడి చెత్త (ప్లాస్టిక్, కాగితం, లోహాలు) వేరు చేయడం ద్వారా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చని తెలిపారు. చెత్తను సరైన విధంగా నిర్వహిస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని, పర్యావరణం కాపాడబడుతుందని చెప్పారు.
సర్పంచ్ దూలం కళ్యాణ్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలందరూ చెత్త వర్గీకరణలో భాగస్వాములు కావాలని, విద్యార్థులు ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయాలని సూచించారు.
ఉపాధ్యాయులు విద్యార్థులకు చెత్త వర్గీకరణ పద్ధతులను ప్రాక్టికల్‌గా చూపిస్తూ, ప్రతి ఇంటిలో రెండు డస్ట్‌బిన్లు ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు.




