Jagtial: నేటి అర్ధరాత్రి నుంచి జగిత్యాల జిల్లాలో ఆటోల బంద్!

Jagtial: రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు ఆటో డ్రైవర్ల సంఘం నాయకులు తెలిపారు. ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

ANAND, JAGITYAL
Published on: 23 Aug 2026 2:46 PM IST
Jagtial
X

Jagtial: నేటి అర్ధరాత్రి నుంచి జగిత్యాల జిల్లాలో ఆటోల బంద్!

Jagtial: రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నేటి అర్ధరాత్రి నుంచి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు ఆటో డ్రైవర్ల సంఘం నాయకులు తెలిపారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోయామని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమను ప్రజలు అర్థం చేసుకుని బందుకు సహకరించాలని కోరారు.

ప్రధాన డిమాండ్లు:

* ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చిన ₹12,000 ఆర్థిక సాయాన్ని వెంటనే అందించాలి.

* ఆటోలకు ఉచితంగా ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.

* రాష్ట్రస్థాయిలో ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి.

* డ్రైవర్ల పిల్లలకు ఉచిత విద్య, కుటుంబాలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందించాలి.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story