Sircilla: బొప్పాపూర్‌లో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు!
Sircilla: బొప్పాపూర్‌లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మానవ హక్కుల సంఘం వ్యవస్థాపకులు కోరారు.
Sircilla: బొప్పాపూర్‌లో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు!
సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో "సే నో టు డ్రగ్స్ఎ బిగ్ యెస్ టు లైఫ్" పేరుతో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ ఫౌండర్ సయ్యద్ అబ్దుల్ కరీం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ఆరు నెలలుగా దేశవ్యాప్తంగా డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
డ్రగ్స్ బారిన పడి అనేక మంది యువతీ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి పాఠశాల, కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
ప్రతి నెల అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు, అన్నదానం, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే న్యాయం కోసం తమ సంస్థను ఆశ్రయించే వారికి చట్టపరంగా అండగా నిలిచి, సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం అయ్యే వరకు సహకరిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ డిప్యూటీ చైర్మన్ లాల్ మహమ్మద్, జాతీయ లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ అజయ్ కుమార్, అడిషనల్ డైరెక్టర్ నజీరుద్దీన్, రాష్ట్ర కార్యదర్శి మాజీద్, జిల్లా కమిటీ సభ్యులు, యువజన విభాగం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




