Karimnagar: ‘అమ్మ ఫౌండేషన్’ సేవా కార్యక్రమం.. 250 మంది ఉపాధి హామీ
Karimnagar: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
Karimnagar: ‘అమ్మ ఫౌండేషన్’ సేవా కార్యక్రమం.. 250 మంది ఉపాధి హామీ
కరీంనగర్: అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో శంకర్ స్వరూప దంపతుల పెండ్లి రోజు సందర్భంగా 250 మంది ఉపాధి హామీ కూలీలకు సల్ల ప్యాకేట్లు పంపిణీ కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ కూలి పనులలో భాగంగా వేసవి కాలం దృష్టి లో ఉంచుకొని అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో నల్లవెల్లి శంకర్ స్వరూప దంపతులు వారి30వ పెళ్లిరోజు సందర్భంగా 250 మంది ఉపాధి హామీ కూలీలకు సల్ల పాకెట్లు పంపిణీ చేసినారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మల్లారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి సుంకరి శ్రీనివాసరావు తన చేతుల మీదుగా పంపిణీ చేసి అనంతరం మాట్లాడుతూ నల్లవెల్లి శంకర్ స్వరూప దంపతులు వారి పెళ్లి రోజు సందర్భంగా మా 250మంది ఉపాధి హామీలకు సల్ల ప్యాకేట్లు పంచడం అభినందనీయమని , ఇలాంటి కార్యక్రమాలను అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపకుడు గోనెల సమ్మన్న ముందుండి నడిపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా వంతు సహకారం ఎల్లవేళలా గ్రామ ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్, 9 వార్డు సభ్యులు గంధం ప్రశాంత్,ఫీల్డ్ అసిస్టెంట్ మోరె మహేష్, అమ్మ ఫౌండేషన్ సభ్యులు గుమ్మడి సంపత్,రాయణవేణి సంపత్,పూదరి సమ్మయ్య,గోనెల పెద్ద సమ్మయ్య,గోనెల నర్సయ్య,కర్రె మల్లికార్జున్,గోనెల నడిపి సమ్మయ్య,పూదరి హారీష్,దూలం గోపి,దూలం కనుకయ్య,రాయణవేణి కనుకయ్య ఉపాధి హామీ కూలీలు తది తరులు పాల్గొన్నారు.




