Karimnagar: తెలంగాణ చౌక్‌లో ఏఐఎస్ఎఫ్ జెండా ఆవిష్కరించిన సీనియర్ నాయకుడు
Karimnagar: సీనియర్ నాయకులు విజయ్ భాస్కర్ జెండా ఆవిష్కరించగా, విద్యార్థి రంగానికి, సామాజిక పోరాటాలకు ఏఐఎస్ఎఫ్ చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.
Karimnagar: తెలంగాణ చౌక్‌లో ఏఐఎస్ఎఫ్ జెండా ఆవిష్కరించిన సీనియర్ నాయకుడు
కరీంనగర్: నగరంలోని తెలంగాణ చౌక్ లో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జెండాను సీనియర్ నాయకులు విజయ్ భాస్కర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు విజయ్ భాస్కర్ మాట్లాడుతూ స్వతంత్రానికి పూర్వం ఉత్తరప్రదేశ్లో బెనారస్లో 12 ఆగస్టు 1936లో ఏర్పడిందని అన్నారు. దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాటం చేసిందని, అలాగే విశాఖ ఉక్కు పై కూడా అలుపెరగని పోరాటం చేసిందని గుర్తు చేశారు.
ప్రధానమంత్రి పదవి అధిరోహించిన గొప్ప నాయకులు ఐకె గుజ్రాల్, వాజ్పాయ్ వంటి వారు ఇందులో కలిసి పని చేశారని తెలిపారు. పేదల కోసం, శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాటాలు కొనసాగిస్తుందని చెప్పారు. ఏఐఎస్ఎఫ్ అంచెలంచలుగా ఎదుగుతూ సామాజిక రుగ్మతలు, విద్యారంగ సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూనే నిరంతరం విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటాలు చేస్తూ ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు, విద్యార్థినిలు, నాయకులు పాల్గొన్నారు.




