Peddapalli: అడ్రియాల ప్రాజెక్టులో ఎయిర్ ట్యాంక్ బ్లాస్ట్: 5 గురికి గాయాలు
Peddapalli: పెద్దపల్లి జిల్లా రామగిరి పరిధిలోని సింగరేణి అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో ఎయిర్ ట్యాంక్ పేలి ఐదుగురు కార్మికులు గాయపడ్డారు.
Peddapalli: అడ్రియాల ప్రాజెక్టులో ఎయిర్ ట్యాంక్ బ్లాస్ట్: 5 గురికి గాయాలు
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పరిధిలో ఉన్న రామగుండం సింగరేణి సంస్థకు చెందిన అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టులోని ఎఫ్‌బీఎల్ ఎయిర్ ట్యాంక్ బ్లాస్ట్ కావడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఐదుగురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంలో ఆపరేటర్ శ్రీనివాస్, ఫిట్టర్ కిరణ్, కార్మికులు లక్ష్మణ్, హెల్పర్లు ప్రశాంత్, మనోజ్ గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న ప్రాజెక్టు అధికారులు వెంటనే క్షతగాత్రులను గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గాయపడిన ఐదుగురు కార్మికుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
రక్షణ చర్యల్లో వైఫల్యమే కారణమా..?
ఈ ప్రమాదంపై బీఎంఎస్ కార్మిక సంఘం నాయకుడు యాదగిరి సత్తయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం రక్షణ చర్యల్లో విఫలమవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. కార్మికుల భద్రత విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యాన్ని వీడి, రక్షణ చర్యలను మరింత పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు.




