Jagtial: మహిళా విద్యకు పూలే బాటలే మార్గదర్శకం.. నివాళులర్పించిన మంత్రి
Jagtial: జగిత్యాల జిల్లా ధర్మపురిలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పూలే చిత్రపటానికి నివాళులర్పించారు.
Jagtial: మహిళా విద్యకు పూలే బాటలే మార్గదర్శకం.. నివాళులర్పించిన మంత్రి
Jagtial: జ్యోతిరావ్ పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. సమాజంలో అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలన పై పోరాడిన మహనీయులు జ్యోతిరావు పూలే అని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే తీసుకువచ్చిన అనేక సంస్కరణలు అణగారిన వర్గాల పాలిట వరంగా మారాయని అన్నారు. స్వేచ్ఛ సమానత్వం కోసం ఫూలే చేసిన సేవలు, పోరాటాలను చేశారని గుర్తు చేశారు. మహిళలకు చదువు నేర్పిస్తే సమాజం బాగుంటుందని భావించి తన భార్య సావిత్రిబాయి పూలే కు చదువు నేర్పించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
సావిత్రిబాయి పూలే ద్వారా మహిళలకు చదువు నేర్పించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు. జ్యోతిరావు పూలే ఆశయ సాధన అందరం కట్టుబడి ఉండాలి అని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి , మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య తో పాటు పలువురు మున్సిపల్ కౌన్సిలర్ లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




