Sircilla: జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే.. 23 అర్జీల స్వీకరణ

Sircilla: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే లో అదనపు ఎస్పీ చంద్రయ్య బాధితుల నుండి 23 ఫిర్యాదులను స్వీకరించారు.

KALEEM, SIRICILLA
Published on: 22 Jun 2026 5:46 PM IST
Sircilla
X

Sircilla: జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే.. 23 అర్జీల స్వీకరణ

Sircilla: జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి 23 ఫిర్యాదులను అదనపు ఎస్పీ చంద్రయ్య స్వీకరించారు.

ఈసందర్భంగా సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ బాధితుల సమస్యలను చట్టపరంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీ ఆదేశించారు.

అనంతరం అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ..

ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు.

తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులు ఆన్ లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని అదనపు ఎస్పీ తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story