Tangallapalli: రామచంద్రాపూర్‌లో భూముల రీసర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్ !

Tangallapalli: తంగళ్లపల్లి మండలం రామచంద్రాపూర్ గ్రామంలో భూముల రీసర్వేను పరిశీలించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్.

KALEEM, SIRICILLA
Published on: 20 Aug 2026 6:40 AM IST
Tangallapalli
X

Tangallapalli: రామచంద్రాపూర్‌లో భూముల రీసర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్ !

Tangallapalli: పారదర్శకత, ఖచ్చితత్వంతో భూముల రీసర్వే ప్రక్రియను చేపట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. రీసర్వేకు సంబంధించిన సమాచారాన్ని గ్రామంలోని ప్రజలందరికీ తెలియజేసి అవగాహన కల్పించాలని సూచించారు.

బుధవారం తంగళ్లపల్లి మండలం రామచంద్రాపూర్ గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రీసర్వే నిర్వహించాలని, భూములకు సంబంధించిన వివరాలను ఖచ్చితత్వంతో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

రీసర్వే ప్రక్రియలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని, గ్రామస్థులకు ముందస్తుగా సమాచారం అందించి వారి సందేహాలను నివృత్తి చేయాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.ఈ పరిశీలనలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story