Siricilla: అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమీక్ష!

Siricilla: అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్యల ఆధ్వర్యంలో నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశం జరిపి, డ్రగ్స్ నియంత్రణకు ఆదేశాలిచ్చారు.

KALEEM, SIRICILLA
Published on: 28 July 2026 8:03 PM IST
Siricilla
X

Siricilla: అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమీక్ష!

సిరిసిల్ల: జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లాలో నమోదైన ఎన్డీపీఎస్ కేసులు, గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు సమావేశంలో వివరించారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగించాలని అదనపు కలెక్టర్ సూచించారు.

డ్రగ్స్‌కు అలవాటు పడిన వారిని గుర్తించి వారికి అవసరమైన వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు తరచూ తనిఖీలు నిర్వహిస్తూ, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని డ్రగ్స్ నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి హిమశ్రీ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శరత్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూషతో పాటు మున్సిపల్, విద్యా, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story