Sircilla: సిరిసిల్లలో ఆయిల్ పామ్ సాగుపై కలెక్టర్ సమీక్ష!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని తప్పక చేరుకోవాలని జిల్లా కలెక్టర్.

KALEEM, SIRICILLA
Published on: 6 Aug 2026 5:04 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో ఆయిల్ పామ్ సాగుపై కలెక్టర్ సమీక్ష!

Sircilla: జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని తప్పక చేరుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. డ్రిప్ ఏర్పాటు, మొక్కల నాటే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రి-యునిక్ కంపెనీ, డ్రిప్ కంపెనీల ప్రతినిధులతో ఆయిల్ పామ్ సాగు పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లక్ష్య సాధనలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు వల్ల రైతులకు కలిగే ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

రైతులకు అవసరమైన సాంకేతిక సహకారం సకాలంలో అందేలా ఉద్యానవన, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించిన కలెక్టర్, డ్రిప్ ఏర్పాటు, మొక్కల సరఫరాలో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత కంపెనీ ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సమావేశంలో జిల్లా ఉద్యానవన అధికారి ఆర్. శరత్ బాబు, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారులు, సంబంధిత కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story