Peddapalli: కాల్వశ్రీరాంపూర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Peddapalli: కాల్వశ్రీరాంపూర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు!
Peddapalli: :పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గురువారం ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి సర్పంచ్ బంగారి రమేష్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గజనవేనా సదయ్య తో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ సాధనలో జయశంకర్ సర్ చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన బాటలోనే నడుస్తామని సంకల్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బంగారి రమేష్ మాట్లాడుతూ "ఆచార్య జయశంకర్ సర్ తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకుడే కాక, గొప్ప విద్యావేత్తగా, ఆలోచనాపరుడిగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా గ్రామాభివృద్ధి, ప్రజాసేవ, విద్యా విస్తరణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి" అని పిలుపునిచ్చారు.
యువతరం జయశంకర్ సిద్ధాంతాలను చదివి అవగాహన చేసుకుని, సమాజ సేవలో ముందుండాలని, కాల్వశ్రీరాంపూర్‌ను ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేందర్, తహసీల్దార్ రాముడు, ఉప సర్పంచ్ గోలి సుధాకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు MD మునీర్, AMC వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, AMC డైరెక్టర్లు అనగంటి రవి, దాగేటి రామచంద్రం, మాజీ సర్పంచ్ మాదాసు సతీష్, మాజీ ఎంపీటీసీ పొట్టలా మొండయ్య, వార్డు సభ్యులు అనిత-అన్వేష్, సౌందర్య-సదయ్య, నాయకులు సొన్నయిటెంకం సాగర్, తాండ్ర గోవర్ధన్, సమ్మయ్య గౌడ్, శ్రీశైలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.




