Manthani: మంథని మార్కెట్ యార్డులో 12 మోటార్లు చోరీ.. పోలీసుల దర్యాప్తు
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన 12 మోటార్లు చోరీకి గురయ్యాయి.
Manthani: మంథని మార్కెట్ యార్డులో 12 మోటార్లు చోరీ.. పోలీసుల దర్యాప్తు
మంథాని: పెద్దపల్లి జిల్లా మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన 12 ప్యాడ్ క్లీనింగ్ మోటార్లు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 26న మోటార్లు చోరీకి గురైనట్లు మార్కెట్ కమిటీ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో 27న మార్కెట్ యార్డు కార్యదర్శి కట్ట సతీష్ కుమార్ మంథని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మోటార్ల విలువ లక్షల రూపాయల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. మార్కెట్ యార్డులో నైట్ వాచ్‌మెన్ ఉన్నప్పటికీ చోరీ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోటార్లను ఎప్పుడు చోరీ చేశారు? ఎంతమంది ఈ ఘటనకు పాల్పడ్డారు? వాటిని ఎలా తరలించారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫిర్యాదు చేసిన మరుసటి రోజే పోలీసులు చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించాల్సి ఉన్నప్పటికీ ఆలస్యంగా ఘటనాస్థలిని సందర్శించడం పై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పోలీసులు మార్కెట్ యార్డులో విచారణ చేపట్టి, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అయితే యార్డులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం గమనార్హం. ఇదే అదునుగా తీసుకుని దుండగులు చోరీకి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
గతంలోనూ మార్కెట్ యార్డులో చోరీలు జరిగినట్లు ఆరోపణలు ఉండటంతో భద్రతా ఏర్పాట్లపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చోరీకి గురైన మోటార్లను గుర్తించి, నిందితులను త్వరగా పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు.




