Pithapuram: పాదగయ కోనేటిలోకి దూకిన 22 ఏళ్ల యువకుడు గాలింపు చర్యలు ముమ్మరం!
Pithapuram: పిఠాపురం పాదగయ క్షేత్రం పుష్కరిణిలో దూకి సాయి (22) అనే యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
Pithapuram: పాదగయ కోనేటిలోకి దూకిన 22 ఏళ్ల యువకుడు గాలింపు చర్యలు ముమ్మరం!
Pithapuram: పిఠాపురం స్థానిక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాదగయ క్షేత్రంలో సోమవారం తెల్లవారుజామున ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. క్షేత్రంలోని కోనేటిలోకి (పుష్కరిణి) దూకి ఒక యువకుడు.
పిఠాపురం మండలం గంగిరెడ్లు కొత్త కంద్రాడ గ్రామానికి చెందిన దనకొండ సాయి (22), తండ్రి పుత్రయ్య అనే యువకుడు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆలయం ఇంకా తెరవక ముందే పాదగయ క్షేత్ర పుష్కరిణిలోకి దూకాడు.
గమనించిన స్థానికులు, అధికారులు వెంటనే స్పందించినప్పటికీ, యువకుడు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడు కోనేటిలోకి దూకడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.




