Samarlakota: వేట్లపాలెంలో రూ. కోటి సీసీ రోడ్డు ప్రారంభించిన చినరాజప్ప

Samarlakota: వేట్లపాలెంలో రూ. 1 కోటి సీసీ రోడ్డును ప్రారంభించిన పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, తుమ్మల రామస్వామి. ఇంటింటికీ కూటమి ప్రభుత్వం ప్రచారం.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 29 July 2026 3:27 PM IST
Samarlakota
X

Samarlakota: వేట్లపాలెంలో రూ. కోటి సీసీ రోడ్డు ప్రారంభించిన చినరాజప్ప

సామర్లకోట: సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో రూ.1 కోటి వ్యయంతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును కాకినాడ జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప,జనసేన పార్టీ అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు వారికి ఘన స్వాగతం పలికి, గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హర్షం వ్యక్తం చేశారు.అనంతరం కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న "ఇంటింటికి కూటమి ప్రభుత్వం" కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు.అదేవిధంగా ఈ కార్యక్రమంలో బిసి కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు, మాజీ జెడ్పిటిసి గుమ్మల్ల విజయలక్ష్మి రామకృష్ణ పాల్గొని కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై వివరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన నిలిచిపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సీసీ రోడ్లు, తాగునీటి సదుపాయాలు, సాగునీటి వసతులు, పారిశుద్ధ్య పనులు తదితర అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.

రైతులకు సాగునీరు అందుబాటులోకి రావడంతో పంట పొలాలు సస్యశ్యామలంగా మారుతున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.గత ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కంటే కేవలం బటన్ నొక్కే కార్యక్రమాలకే పరిమితమైందని విమర్శించిన వారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా సమర్థవంతమైన పాలన కొనసాగుతోందని తెలిపారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతు తెలుపుతూ అభివృద్ధికి అండగా నిలవాలని, గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు మరియు అధిక సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story