Uppada: సముద్రంలో బోటుపై డిప్యూటీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం!
Uppada: ఉప్పాడ తీర రక్షణకు రూ.323 కోట్ల నిధుల మంజూరు. సముద్రంలో బోటుపై పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మత్స్యకారులు, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్.
Uppada: సముద్రంలో బోటుపై డిప్యూటీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం!
Uppada: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం.... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో ఉప్పాడ తీర ప్రాంతాన్ని సముద్ర కోత నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.323 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు అంగీకరించడం పట్ల స్థానిక మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు.
ఇటీవల తీర రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి సాంకేతిక సహాయం, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించేందుకు మద్రాస్ ఐఐటీతో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఒప్పందం కుదరడంతో, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక మత్స్యకారులు వినూత్నంగా పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు, కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇంచార్జ్ రావు అక్షయ్,గోదావరి తూర్పు డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ పలు గ్రామాల ఇన్చార్జిలు స్థానిక మత్స్యకారులు,జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో కలిసి బోట్లపై సముద్రంలో ప్రయాణించారు. అనంతరం బోటుపైనే మత్స్యకారులతో కలిసి పవన్ కళ్యాణ్
చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.




