Pithapuram: గొల్లప్రోలులో గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యం!

Pithapuram: కాకినాడ జిల్లా గొల్లప్రోలు NH-216 రోడ్డు సమీపంలోని నీటి గుంటలో గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది.

V. Ramakrishna, Pithapuram
Published on: 26 Aug 2026 7:36 PM IST
Pithapuram
X

Pithapuram: గొల్లప్రోలులో గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యం!

పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గము ది. 26.08.2026 తేదీన సాయంత్రం సుమారు 05:00 గంటల సమయంలో, గొల్లప్రోలు గ్రామంలోని NH-216 రోడ్డుపై శ్రీరామ్ స్కూల్ సమీపంలో ఉన్న పొదల్లోని వర్షపు నీటి గుంటలో సుమారు 45 నుండి 50 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని పురుషుని మృతదేహం గుర్తించబడింది.

సదరు వ్యక్తి సుమారు 5 అడుగుల ఎత్తు కలిగి ఉండి, నలుపు రంగు టీ-షర్ట్ మరియు ఖాకీ రంగు నిక్కర్ ధరించి ఉన్నాడు. సదరు వ్యక్తి యొక్క ఆచూకీ లేదా వివరాలు తెలిసిన వారు, క్రింది ఫోన్ నంబర్‌కు సమాచారం అందించగలరు. సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్, ఫోన్ నంబర్: 9440900758

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story