Pithapuram: గొరిఖండి కాలవలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం!

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ పరిధిలోని గొరిఖండి కాలవలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం దొరికింది.

V. Ramakrishna, Pithapuram
Published on: 29 July 2026 4:37 PM IST
Pithapuram
X

Pithapuram: గొరిఖండి కాలవలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం!

పిఠాపురం:పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా సమీపంలో గొరిఖండి కాలవలో గుర్తుతెలియని సుమారు 35 నుండి 40 సంవత్సరాల వయసు కలిగిన మగ వ్యక్తి మృతదేహం లభ్యమైనది.

సదరు వ్యక్తి జీన్స్ ప్యాంటు, ఫుల్ హ్యాండ్ షర్ట్ ధరించి, ప్యాంటుకు బెల్టు పెట్టుకొని మొలతాడు కలిగి ఉన్నాడు. మృతుని కుడి చేతి పై "SR" అని ఇంగ్లీషులో టాటూ మరియు ఎడమ చేతి పై "అమ్మ నాన్న" అని తెలుగులో, "SIRISHA" అని ఇంగ్లీషులో టాటూ మార్క్స్ కలవు. మృతుని డెడ్ బాడీని పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో భద్రపరచడమైనది. మృతుడి ఆచూకీ తెలిసినవారు క్రింది ఫోన్ నెంబర్లకు సంప్రదించగలరు.

CI Pithapuram 9440796523, SI Pithapuram Rural 9490760765

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story