Tuni: తలుపులమ్మ అమ్మవారి హుండీ ఆదాయం రూ.92.81 లక్షలు

Tuni: కాకినాడ జిల్లా తుని తలుపులమ్మ అమ్మవారి హుండీ ఆదాయం వెల్లడి. 38 రోజులకు గాను రూ.92,81,856 సమకూరినట్లు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు వెల్లడి.

MANIKANTA, TUNI
Published on: 17 Aug 2026 5:50 PM IST
Tuni
X

Tuni: తలుపులమ్మ అమ్మవారి హుండీ ఆదాయం రూ.92.81 లక్షలు

తుని: కాకినాడ జిల్లా తుని మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాస హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు.

సోమవారం ఆలయంలో హుండీలు తెరిచి లెక్కింపు చేపట్టగా.. 38 రోజులకు గాను మొత్తం రూ.92,81,856 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన ఉపకమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు.

హుండీ ద్వారా నగదు రూపంలో రూ.87,32,592, నాణేల రూపంలో రూ.5,49,264 లభించినట్లు ఆయన వెల్లడించారు. హుండీ లెక్కింపు ప్రక్రియను జిల్లా దేవదాయశాఖ అధికారి వి.వెంకటేశ్వరరావు, గ్రూప్ టెంపుల్స్ సామర్లకోట ఈవో బీవీఆర్ చౌదరి, సంపర గ్రూప్ టెంపుల్స్ ఈవో వి.సత్తిబాబు పర్యవేక్షించారు.

దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పి.భాస్కర సత్యనారాయణతో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI

Next Story