Tuni: తునిలో 'QVSE' ట్రేడింగ్ యాప్ మోసం డాలర్ల ఆశ చూపి కోట్లు దోపిడీ!

Tuni: కాకినాడ జిల్లా తునిలో 'QVSE', 'BonChat' ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌లతో భారీ మోసం. రోజువారీ టాస్క్‌ల పేరుతో అమాయకుల నుండి కోట్లాది రూపాయలు దోపిడీ.

MANIKANTA, TUNI
Published on: 7 Sept 2026 12:18 PM IST
Tuni
X

Tuni: తునిలో 'QVSE' ట్రేడింగ్ యాప్ మోసం డాలర్ల ఆశ చూపి కోట్లు దోపిడీ!

Tuni: కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట సామాన్యులను, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ‘QVSE’ మరియు ‘BonChat’ వంటి ఆన్‌లైన్ అప్లికేషన్ల ద్వారా రోజువారీ కోడింగ్ మరియు ట్రేడింగ్ టాస్క్‌ల పేరుతో అమాయక ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగిస్తున్న వైనం తీవ్ర కలకలం రేపుతోంది.

మోసపోయే తీరు ఇలా..

ఈ సైబర్ కేటుగాళ్లు బాధితులకు సోషల్ మీడియా లేదా పరిచయస్తుల ద్వారా రిఫరల్స్ పంపి, ‘సోషల్ పిన్’ విధానం ద్వారా నెట్‌వర్క్‌లోకి ఆకర్షిస్తున్నారు. రూ. 50,000 నుంచి రూ. 3 లక్షల వరకు డిపాజిట్ చేయిస్తూ, రోజువారీ 1 నుంచి 3 శాతం వరకు డాలర్ల రూపంలో లాభాలు వస్తాయని నమ్మిస్తున్నారు.

బాధితులు ఆశపడి డబ్బులు కట్టిన తర్వాత, ప్రతిరోజూ యాప్‌లో చిన్న మొత్తాలు వస్తున్నట్లు చూపించి నమ్మిస్తారు. ఆ తర్వాత విత్‌డ్రాలు ఆపేసి, అకౌంట్ వెరిఫికేషన్ పేరుతో అదనంగా మరో 500 డాలర్లు చెల్లించాలంటూ మరింతగా వేధిస్తున్నారు. చివరకు బాధితులు తాము పెట్టిన అసలు డబ్బులు కూడా వెనక్కి తీసుకోలేక రోడ్డున పడుతున్నారు.

తుని టౌన్ సీఐ హెచ్చరిక:

ఈ భారీ సైబర్ మోసంపై తుని టౌన్ సీఐ స్పందిస్తూ ప్రజలను తీవ్రంగా అప్రమత్తం చేశారు. ఇలాంటి ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, నకిలీ యాప్‌లను నమ్మి కష్టపడ్డ డబ్బును పోగొట్టుకోవద్దని హెచ్చరించారు. బాధితులు ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులను, స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో, ప్రజలు ఎవరూ ఇలాంటి మోసపూరిత లింకులు మరియు యాప్‌ల బారిన పడకూడదని అధికారులు కోరుతున్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI

Next Story