Tuni: తుని వద్ద తప్పిన పెను ప్రమాదం!

Tuni: కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం తప్పింది. వైజాగ్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

MANIKANTA, TUNI
Published on: 5 July 2026 8:05 AM IST
Tuni
X

Tuni: తుని వద్ద తప్పిన పెను ప్రమాదం!

Tuni:​ కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన శనివారం కలకలం రేపింది.

​వివరాల్లోకి వెళ్తే.. వైజాగ్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తుని పరిధిలోకి రాగానే ప్రమాదానికి గురైంది. బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు ఒక్కసారిగా కళ్లు తిరగడంతో, అదుపుతప్పిన వాహనం జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.

​ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో, వారిని వెంటనే చికిత్స నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

​ప్రస్తుతం స్వల్ప గాయాలైన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన మిగిలిన ప్రయాణికులు సమీపంలోని బస్సు షెల్టర్ వద్ద వేచి చూస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ట్రావెల్స్ యాజమాన్యంతో అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై స్వల్పంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో, పోలీసులు వెంటనే వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI

Next Story