Pithapuram: పిఠాపురం రైతులకు సాగునీరు అందించాలి తుమ్మల రామస్వామి బాబు!
Pithapuram: పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి రైతుకు సాగునీరు అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు కోరారు.
Pithapuram: పిఠాపురం రైతులకు సాగునీరు అందించాలి తుమ్మల రామస్వామి బాబు!
Pithapuram: పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి రైతుకు సాగునీరు అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు కోరారు. మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన నీటిపారుదల శాఖ సాగునీటి సలహాదారుల సంఘాల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఇరిగేషన్ శాఖ ఎస్.ఈ.తో పాటు సంబంధిత అధికారులు, పిఠాపురం నియోజకవర్గ ఫైనల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, ఇటీవల ఏలేరు ప్రాజెక్టులో నీటి లభ్యత తగ్గిపోవడంతో పిఠాపురం నియోజకవర్గంతో పాటు ఆయకట్టు పరిధిలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కాలువల చివరి ప్రాంతాల వరకు నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు.
పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కాలువల టెయిల్ ఎండ్ (చివరి భాగం) వరకు నీరు చేరేలా సమర్థవంతమైన ప్రణాళికతో నీటి పంపిణీ నిర్వహించాలని సూచించారు.
అలాగే, ఏలేరు ఆయకట్టు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని తుమ్మల రామస్వామి బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల పిఠాపురం నియోజకవర్గంతో పాటు ఆయకట్టు పరిధిలోని వేలాది మంది రైతులకు ఊరట లభిస్తుందని అన్నారు.
రైతుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి, సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి రైతు పొలానికి సాగునీరు చేరే వరకు తమ వంతు కృషి కొనసాగిస్తామని తుమ్మల రామస్వామి బాబు స్పష్టం చేశారు.




