Kakinada: శంఖవరం మండలంలో పెద్దపులి సంచారం.. ఆవుపై దాడి!

Kakinada: కాకినాడ జిల్లా శంఖవరం మండలం అవేల్తిలో పెద్దపులి సంచారం. ఆవుపై దాడి చేసి మృతికి కారణమైన పులి. గ్రామస్తులను అప్రమత్తం చేసిన రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Sept 2026 8:56 AM IST
Kakinada
X

Kakinada: శంఖవరం మండలంలో పెద్దపులి సంచారం.. ఆవుపై దాడి!

Kakinada: ది..11.9.26 వ తేదీన పెద్దపులి మండలంలో లోని అవేల్టి గ్రామం లోని గోము .ధర్మరాజు కు చెందిన మేతకు వెళ్ళిన రెండు ఆవులపై సాయంత్రం సుమారు 3-4 గంటలకు దాడి చేయగా ఒక ఆవు మరణించిందని ,ఒక ఆవు గాయపడి అడవి నుండి గ్రామంలో వచ్చినట్లుగా సమాచారం.

వేళంగి గ్రామ రెవెన్యూ అధికారి ఇచ్చిన సమాచారం అనుసరించి వేళంగి గ్రామ పంచాయతీ పరిధిలో గల అవేల్తి,ఒండ్రేగుల,అనుమర్తి,మరియు పెదమల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల గ్రామాల్లో పులి సంచరిస్తున్న సమాచారం తెలియపరచి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అడవి ప్రాంతంలో సంచరించరాదని ,పశువులు(మేకలు,ఆవులు,గేదెలు) అడవిలోనికి మేతకు పంపారాదని , సురక్షిత ప్రాంతాల్లో ఉంచవలసినదిగా ప్రజలను అప్రమత్తం చేసి రౌతులపూడి ఫారెస్ట్ అధికారులకు పులి సంచార సమాచారం తెలియజేసినారు.

ఈ రోజు కొంతంగి, గొంది కొత్తపల్లి,వేళంగి ,గ్రామ రెవెన్యూ అధికారులు,శంఖవరం ఎమ్మార్వో,వెటర్నిటీ డాక్టర్,శంఖవరం మరియు రౌతులపూడి రేంజ్ ఫారెస్ట్ అధికారులు సిబ్బందితో కలిసి పులి సంచరిస్తున్న అవేల్తి గ్రామం సందర్శించి,గాయపడిన ఆవును పరీక్షించి పశు సంవర్ధక డాక్టర్ తగిన చికిత్స అందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్