Kakinada: శంఖవరం మండలంలో వరుస హత్యలు.. తీవ్ర కలకలం!

Kakinada: శృంగధార వద్ద ముర్ల మణికంఠ అనే యువకుడు హత్యకు గురికాగా, కత్తిపూడి వద్ద సగం కాలిన స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

AYYAPPA SWAMI, PRATTIPADU
Published on: 18 Aug 2026 11:39 PM IST
Kakinada
X

Kakinada: శంఖవరం మండలంలో వరుస హత్యలు.. తీవ్ర కలకలం!

కాకినాడ: శంఖవరం మండలం శృంగధార వద్ద ఓ యువకుడు హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ముర్ల మణికంఠ అనే యువకుడిని కైకాని చంద్రయ్య హత్య చేసినట్లు సమాచారం.

మణికంఠ తన భార్యను వేధిస్తున్నాడనే కారణంతోనే చంద్రయ్య ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, శంఖవరం మండలంలోని కత్తిపూడి వద్ద నిన్న రాత్రి సగం కాలిన స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఒకవైపు కత్తిపూడిలో గుర్తుతెలియని వ్యక్తి కాలిన మృతదేహం లభ్యం కావడం, మరోవైపు శృంగధార వద్ద యువకుడు హత్యకు గురికావడంతో శంఖవరం మండలంలో వరుస హత్యా ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వరుస ఘటనలతో మండల పోలీసులు అప్రమత్తమై దర్యాప్తును ముమ్మరం చేశారు.

AYYAPPA SWAMI, PRATTIPADU

AYYAPPA SWAMI, PRATTIPADU

Next Story