Samarlakota: పచ్చకామెర్లు కాచి చల్లార్చిన నీటిని తాగాలన్న వైద్యాధికారులు

Samarlakota: కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో పచ్చకామెర్లు వ్యాపిస్తుండటంతో వైఎస్సార్‌సీపీ నేతలు సీహెచ్‌సీని సందర్శించారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 7 Aug 2026 3:16 PM IST
Samarlakota
X

Samarlakota: పచ్చకామెర్లు కాచి చల్లార్చిన నీటిని తాగాలన్న వైద్యాధికారులు

Samarlakota: సామర్లకోట పట్టణంలో వివిధ వార్డుల్లో పచ్చకామెర్లు ప్రబరిల్లినట్లు పలువురు వైసిపి నాయకులు స్థానిక సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వచ్చి డాక్టర్ని పచ్చకామెర్లపై ఎందుకొస్తున్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు .

అనంతరం వైసిపి నాయకులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ గత ఐదు రోజుల సామర్లకోట పట్టణంలో పలు వార్డులకు చెందిన పిల్లలు హాస్పటల్లో జాయిన్ అవుతున్నారని ఏంటి అని డాక్టర్లను ప్రశ్నిస్తే ఫుడ్ పాయిజన్ అంటున్నారని ఫుడ్ పాయిజన్ అంటే ఒక ఏరియాలో అవ్వాలి కానీ పట్టణంలో పలు వార్డుల్లో అవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు మరియు చేపల చెరువులో చేపలు పట్టడం వల్ల వాటర్ కంటామినేట్ అయ్యుంటుందని పలుమార్లు స్థానిక కమిషనర్ కి విన్నవించుకున్న పట్టించుకున్న దాఖలాలు లేవని వారు విమర్శించారు .

ఇప్పటికైనా అధికారులు డాక్టర్లు స్పందించి మెరుగైన వైద్యం అంది త్వరగా కోలుకునే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని వారి కోరారు సామర్లకోట సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మాట్లాడుతూ సోమవారం సోమవారం కడుపునొప్పి వాంతులతో పిల్లలు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని ఎలీషా టెస్టులు నిమిత్తం పైకి పంపించామని ఇన్ పేషంట్ ఆరుగురని అవుట్ పేషెంట్ ఒకరి ఆయన తెలిపారు ప్రస్తుతం వారి పరిస్థితి నిలబడగానే ఉంద అయితే పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి బయట ఆహార పదార్థాలు తీసుకోవద్దని కాచి చల్లార్చిన నీలే తాగాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story