Pithapuram: పిఠాపురం కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎస్‌బీఐ జనరల్ మేనేజర్!

Pithapuram: పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎస్‌బీఐ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్.

V. Ramakrishna, Pithapuram
Published on: 14 Jun 2026 12:26 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎస్‌బీఐ జనరల్ మేనేజర్!

కాకినాడ జిల్లా: కుక్కుటేశ్వరస్వామి వారి దేవస్థానమునకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా జనరల్ మేనేజర్ (CAO) చంద్రశేఖర్ కుటుంబ సమేతముగా విచ్చేశారు. వారికి ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు.

అనంతరం దత్తాత్రేయ స్వామి, కుక్కుటేశ్వర స్వామి వారిని, రాజరాజేశ్వరి అమ్మవార్లను, పురుహూతికా అమ్మవారిని దర్శనం చేసుకుని విశేష పూజలు ఆచరించారు. పూజల అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి శేష వస్త్రాలు, చిత్రపటం అందచేశారు.

ఈ కార్యక్రమంలో పిఠాపురం స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ కె. శ్రీనివాస్, ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ కార్యక్రమములో సిబ్బంది కొప్పిశెట్టి దత్తాత్రేయ, కొటికలపూడి హనుమంతరావు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story