Samarlakota: సామర్లకోట జడ్పీ స్కూల్‌లో సరస్వతీ దేవి విగ్రహావిష్కరణ
Samarlakota: సామర్లకోట జడ్పీ బాలికల స్కూల్‌లో నిర్వహించిన మెగా పిటిఎం 4.0 కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు.
Samarlakota: సామర్లకోట జడ్పీ స్కూల్‌లో సరస్వతీ దేవి విగ్రహావిష్కరణ
సామర్లకోట: మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ఏపీ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరుగుతుందని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు.శుక్రవారం సామర్లకోట జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు రాయుడు విజయలక్ష్మి ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ - టీచర్స్ సమావేశం 4.0 కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చినరాజప్ప హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ పేదరికం కారణంగా ఏ విద్యార్థీ చదువుకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీ ప్రకారం అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లీప్ స్కూల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని దానిలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గం లో జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాల లీప్ స్కూల్ కి ఎంపిక చేయడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో నడిపించడం జరుగుతుందని, మంత్రి లోకేష్ విద్యా రంగంలో పలు మార్పులు చేపడుతుండగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకుని గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పెద్దాపురం నియోజకవర్గం లో సంక్షేమమే కాకుండ అభివృద్ధి పనులను వేగ వంతం చేయడం జరిగిందని దానిలో భాగంగా పెద్దాపురం,
సామర్లకోటలో రూ.20 కోట్లతోను, రూరల్ ప్రాంతాల్లో రూ.50 కోట్ల నిధులతో అభివృధి పనులు చేయడం జరుగుతుందని, పెద్దాపురం - సామర్లకోట పట్టణాల ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరును ఏలేరు నుండి తీసుకుని వచ్చి అందజేయడం జరుగుతుందని, గ్రామాల ప్రజలకు గోదావరి నుండి త్రాగునీరును ఇంటింటికి అందజేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో విద్యా నాణ్యత పెంపే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి తల్లిదండ్రులు LEAP యాప్ తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే చినరాజప్ప పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పలు విషయాలపై ప్రసంగించారు. అంతకు ముందు సాన సతీష్ బాబు ఫౌండేషన్ అధ్యక్షులు తలాటం హరీష్ సౌజన్యంతో పాఠశాల మైదానంలో సరస్వతీ దేవిని ప్రతిష్టించగా, ఎమ్మెల్యే చిన రాజప్ప, కూటమి నాయకులు పాల్గొని ప్రాంగణానికి కొబ్బరి కాయ కొట్టి, రిబ్బన్ కటింగ్ నిర్వహించి సరస్వతీ దేవి విగ్రహావిష్కరణ చేశారు.
అనంతరం పాఠశాల,కళాశాల స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే చినరాజప్ప అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్,బడుగు శ్రీకాంత్, సరోజ వాసు,కంటే జగదీష్ మోహన్, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, పిట్టా జానకి రామారావు, అందుగుల మణికుమారి జార్జి చక్రవర్తి, తాతపూడి కృష్ణ బాబు, బలుసు వాసు, తాతపూడి అరుణ్ వంశీ, దేవుళ్ళ శివ, పడాల వీరబాబు, తలాటం హరీష్, ఏం.ఈ.ఓ పుల్లయ్య, నూతలపాటి అప్పలకొండ, ఎస్ఎంఎస్ కమిటీ వైస్ చైర్మన్ పచ్చాకుల లోవరాజు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు హనుమత్ రావు, సరస్వతీ, గురు ప్రకాష్, సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




