Samalkota: భీమేశ్వర స్వామి ఆలయంలో జన్మ నక్షత్ర మహోత్సవాలు!

Samalkota: సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో ఆశ్లేష జన్మ నక్షత్ర పూజలు. బాల త్రిపుర సుందరీ దేవికి సహస్ర కుంకుమార్చనలు. పోటెత్తిన భక్తులు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 13 July 2026 11:52 AM IST
Samalkota
X

Samalkota: భీమేశ్వర స్వామి ఆలయంలో జన్మ నక్షత్ర మహోత్సవాలు!

Samalkota: సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి జన్మ నక్షత్ర మహోత్సవాలను సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కంటే జగదీష్ మోహన్,ఈవో బల్ల నీలకంఠం ఆధ్వర్యంలో అర్చకులు రాంబాబు శర్మ వెంకన్న శర్మ వినయ్ శర్మ సత్య నారాయణ మూర్తి తదితర పండితులు భీమేశ్వర స్వామికి ఆశ్లేష జన్మ నక్షత్ర పూజలను, బాల త్రిపుర సుందరీ దేవికి సహస్ర కుంకుమ పూజలు నిర్వహించారు.రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు.జన్మ నక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని ఆశ్లేష నక్షత్ర జాతకులు ఈ స్వామి వారిని దర్శిస్తే మంచి ఫలితాలు చేకూర్తాయని పండితులు వివరించారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story