Razole: మంచినీటి ట్యాంక్‌కు ఎమ్మెల్యే వరప్రసాద్ శంకుస్థాపన

Razole: మలికిపురం మండలం వడ్లపాలెంలో 30 కేఎల్ సామర్థ్యం గల మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు.

PRABHU, RAZOLE
Published on: 4 May 2026 5:20 PM IST
Razole
X

Razole: మంచినీటి ట్యాంక్‌కు ఎమ్మెల్యే వరప్రసాద్ శంకుస్థాపన

Razole: అమరజీవి – జలధార వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా మలికిపురం మండలం చింతలమోరి గ్రామ పంచాయతీ పరిధిలోని వడ్లపాలెం లో 30 KL సామర్థ్యం గల మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిని అత్యవసరంగా పరిష్కరించడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. తాత్కాలికంగా ప్రతి రోజు ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు.

శాశ్వత పరిష్కారంగా సుమారు 4 కిలోమీటర్ల పైప్‌లైన్ ఏర్పాటు చేసి, 350 ఇళ్లకు ట్యాప్ కనెక్షన్లు కల్పించి, మూడు నెలల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అలాగే గ్రామంలో రోడ్డు సదుపాయం లేకపోవడం అన్యాయమని పేర్కొంటూ, అలాగే రోడ్ల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు విషయాన్ని కూడా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

గ్రామ ప్రజలకి ఏ సమస్యలున్నా పంచాయతీ సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్, స్థానిక నాయకులు లేదా నేరుగా తనను సంప్రదించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story