Razole: పది ఫలితాల్లో రాజోలు విద్యార్థిని రికార్డు ఎమ్మెల్యే అభినందనలు
Razole: పదవ తరగతి ఫలితాల్లో 597 మార్కులతో కోనసీమ జిల్లా టాపర్‌గా నిలిచిన రాపాక లైస్ ఇవాంజెలిన్‌ను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సత్కరించారు.
Razole: పది ఫలితాల్లో రాజోలు విద్యార్థిని రికార్డు ఎమ్మెల్యే అభినందనలు
Razole: 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించి అంబేడ్కర్ కోనసీమ జిల్లా టాఫర్ గా నిలిచిన రాపాక లైస్ ఇవాంజెలిన్ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఘనంగా సన్మానించారు. పది ఫలితాల్లో రాష్ట్రంలో మూడో స్థానం, జిల్లాలో మొదటి స్థానం దక్కించుకొని ప్రతిభ కనబరిచిన ఇవాంజెలిన్ పై ప్రశంసలు కురిపించారు.
సఖినేటిపల్లి సమీపంలోని శ్రీ చైతన్య స్కూల్‌లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్న విద్యార్దిని ఈ విజయంతో పాఠశాలకు, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచారన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు మలికిపురం మండలం లోని విశ్వేశ్వరాయపురం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ లైస్ ఇవాంజెలిన్‌ను అభినందించి చిరు సత్కారం చేసారు.
ఈ విజయానికి తోడ్పడిన ప్రిన్సిపాల్ సతీష్ కుమార్, అధ్యాపక సిబ్బంది మరియు తల్లిదండ్రులు రాపాక శేఖర్, జ్యోతి లకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులు మరింత ముందుకు వెళ్లి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.




