Razole: రాజోలులో రూపురేఖలు మార్చుకోనున్న తాగునీటి వ్యవస్థ

Razole: రాజోలు నియోజకవర్గంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎన్‌జీటీ నిధులతో మంజూరైన భారీ మంచినీటి వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దేవ శంకుస్థాపన చేశారు.

PRABHU, RAZOLE
Published on: 2 Jun 2026 7:16 PM IST
Razole
X

Razole: రాజోలులో రూపురేఖలు మార్చుకోనున్న తాగునీటి వ్యవస్థ

Razole: NGT నిధులతో మంజూరైన నాలుగు మంచినీటి వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్. రాజోలు నియోజకవర్గంలోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో NGT నిధుల ద్వారా మంజూరైన నాలుగు మంచినీటి వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులకు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నేడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సఖినేటిపల్లి మండలం పరిధిలోని అంతర్వేది దేవస్థానం చెరువు గట్టు ప్రాంతంలో 60 KL సామర్థ్యం గల వాటర్ ట్యాంక్, అలాగే గుండుబోగులవారి గ్రూప్ ప్రాంతంలో 30 KL సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను ప్రారంభించారు.

అదేవిధంగా కేశవదాసుపాలెం గ్రామంలోని ఆగస్టిన్ కాలనీలో 20 KL సామర్థ్యం గల వాటర్ ట్యాంక్, ఇందిరమ్మ కాలనీలో 30 KL సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఈ వాటర్ ట్యాంకుల నిర్మాణం పూర్తయిన అనంతరం స్థానిక ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story