Mamidikuduru: నగరంలో ఘనంగా మహమ్మద్ ప్రవక్త జయంతోత్సవం!

Mamidikuduru: మామిడికుదురు మండలం నగరంలో ఘనంగా మహమ్మద్ ప్రవక్త జయంతోత్సవం. బడే బీబీ పంజా వద్ద ఉర్దూ కవుల సమ్మేళనం, సత్కారాలు.

PRABHU, RAZOLE
Published on: 31 Aug 2026 1:24 PM IST
Mamidikuduru
X

Mamidikuduru: నగరంలో ఘనంగా మహమ్మద్ ప్రవక్త జయంతోత్సవం!

Mamidikuduru: బీ.ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం నగరంలో ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్‌ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బడే బీబీ పంజా వద్ద మీలాద్‌ (ఉర్దూ కవుల సమ్మేళనం) నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రబోధకుడు అక్బర్‌ షా మీలాద్‌ ఆలాపించారు. పలువురు కవులు మహమ్మద్‌ ప్రవక్త జీవిత విశేషాలు, బోధనలు, మహిమలను భక్తులకు వివరించారు. అనంతరం సమ్మేళనంలో పాల్గొన్న కవులను నిర్వాహకులు సత్కరించి ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story