Pithapuram: పాడా ఆఫీస్‌లో పీజీఆర్‌ఎస్.. పవన్ కళ్యాణ్‌కు కాంట్రాక్టర్ల అర్జీ!
Pithapuram: 4 కోట్ల బిల్లుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్రైవేట్ కాంట్రాక్టర్లు పాడా ఆఫీసర్ ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వినతిపత్రం అందజేశారు.
Pithapuram: పాడా ఆఫీస్‌లో పీజీఆర్‌ఎస్.. పవన్ కళ్యాణ్‌కు కాంట్రాక్టర్ల అర్జీ!
పిఠాపురం: పిఠాపురం పట్టణం పాడా ఆఫీస్ నందు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రైవేటు కాంట్రాక్టర్లు అందరూ కలిసి తమ సమస్యలను తీర్చాలంటూ గత 3 సంవత్సరాలుగా చేసిన ప్రతి కాంట్రాక్టుకు బిల్లులు ఇప్పించాలని పాడా ఆఫీసర్ డా ఎన్.వి. శివరాం ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రైవేట్ కాంట్రాక్టర్లు బొజ్జ దొరబాబు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా పిఠాపురం పట్టణంలో ఎన్నో కాంట్రాక్టులు ఒప్పుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చిన సక్రమంగా అనుకున్న టైంకు పూర్తి చేసి ఇస్తున్నాము అని కానీ మా బిల్లులు మాత్రం ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటూ మాకు ఇవ్వటం లేదని,ఇప్పటికైనా స్పందించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళమని అడగడం జరిగిందని కచ్చితంగా తీసుకెళ్లి మీ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.
సురవరపు సోమేశ్వరరావు మాట్లాడుతూ ఈ మూడు సంవత్సరాలలో ఎన్నో కాంట్రాక్టులో పూర్తి చేసామని సుమారు 4 కోట్ల రూపాయలు రావాల్సిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి మేము పూర్తి చేసిన కాంట్రాక్ట్ పనులకు బిల్లులు ఇప్పించవలసిందిగా ప్రతి సంవత్సరం మే నెల పన్నులు కట్టిన తర్వాత ఇస్తామని చెప్పడం కానీ ఇవ్వకపోవడం ప్రతిసారి కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం తప్ప ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బొజ్జ దొరబాబు,సురవరపు మునేశ్వరరావు,కొత్తేం భాను, వజ్రపు శ్రీనివాసరావు,దేవరపు రామ్మోహన్రావు, ఎం.మాణిక్యాలరావు,సురవరపు సతీష్,మాదాసు రాంబాబు, దాసరి కృష్ణ,సురవరపు దివాణం, కొప్పిశెట్టి భాస్కరరావు,కాంట్రాక్ట్ వర్కులు చేస్తున్న పలువురు పాల్గొన్నారు.




