Pithapuram: విజిబుల్ పోలీసింగ్: పిఠాపురంలో పోలీసుల తనిఖీలు!

Pithapuram: పిఠాపురంలో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం పోలీసులు ఉప్పాడ రోడ్, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో విస్తృతంగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 15 Sept 2026 8:03 PM IST
Pithapuram
X

Pithapuram: విజిబుల్ పోలీసింగ్: పిఠాపురంలో పోలీసుల తనిఖీలు!

పిఠాపురం: పిఠాపురం పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు భద్రతా భావన కల్పించడం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం మరియు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగా ఈరోజు సాయంత్రం పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు పిఠాపురం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ సిబ్బందితో విస్తృతంగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.

పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ రోడ్ సెంటర్, పిఠాపురం రైల్వే స్టేషన్, బస్టాండ్ సెంటర్ తదితర ముఖ్యమైన మరియు రద్దీ ప్రాంతాల్లో పోలీసులు కాలినడకన పెట్రోలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు, అనుమానాస్పద వస్తువులు మరియు అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచారు. ప్రయాణికులు, ప్రజల భద్రతకు సంబంధించి కూడా పోలీసు అధికారులు పరిశీలించారు.

అదేవిధంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. రద్దీ ప్రాంతాల్లో ప్రజలకు మరియు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

పట్టణంలో విజిబుల్ పోలీసింగ్‌ను మరింత పెంచడం ద్వారా నేరాల నివారణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ మరియు ప్రజల్లో భద్రతా నమ్మకాన్ని పెంపొందించడమే పోలీసుల ప్రధాన లక్ష్యం అని అధికారులు తెలిపారు.

ప్రజలు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, పోలీసులకు సహకరించాలని కోరారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram