Pithapuram: పిఠాపురంలో పారిశుధ్య కార్మికుల భద్రతపై శిక్షణ

Pithapuram: పిఠాపురంలో PADA, UNICEF ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల భద్రత, గౌరవంపై PDOలకు ప్రత్యేక శిక్షణ. కార్మికుల హక్కులు, రక్షణ పరికరాలపై సమగ్ర చర్చ.

V. Ramakrishna, Pithapuram
Published on: 12 Aug 2026 9:38 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురంలో పారిశుధ్య కార్మికుల భద్రతపై శిక్షణ

పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పారిశుధ్య కార్మికుల భద్రత, గౌరవంపై పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (PADA) సహకారంతో UNICEF ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం.

పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (PADA) సహకారంతో UNICEF బృందం ఆధ్వర్యంలో 52 మంది పంచాయతీ అభివృద్ధి అధికారులు (PDO)కు “పారిశుధ్య కార్మికుల భద్రత మరియు గౌరవంపై సమీక్షా విధానం” (Review System for Safety & Dignity of Sanitation Workers) అనే అంశంపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి (DPO) హాజరై, పారిశుధ్య కార్మికుల భద్రత, ఆరోగ్యం, గౌరవం మరియు సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.

పాడా సహకారంతో నిర్వహించిన ఈ శిక్షణలో పారిశుధ్య కార్మికులకు సురక్షితమైన పని వాతావరణం కల్పించడం, భద్రతా ప్రమాణాలను పాటించడం, వ్యక్తిగత రక్షణ పరికరాల (PPE) వినియోగం, కార్మికుల హక్కులను పరిరక్షించడం, వారి గౌరవాన్ని కాపాడటం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

పారిశుధ్య కార్మికుల భద్రత, గౌరవం మరియు సంక్షేమానికి పాడ అధిక ప్రాధాన్యతనిస్తూ, సంబంధిత శాఖల సమన్వయంతో మరిన్ని అవగాహన, శిక్షణ మరియు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story