Kakinada: పిఠాపురంలో చేనేత ఆకలి కేకలు.. పాలకుల నిర్లక్ష్యం!
Kakinada: పిఠాపురంలో చేనేతల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
Kakinada: పిఠాపురంలో చేనేత ఆకలి కేకలు.. పాలకుల నిర్లక్ష్యం!
కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గం.. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం, గత కొన్ని నెలలుగా ప్రజా ప్రతినిధులతో, అధికారులతో జరిపిన సంప్రదింపులు,చర్చలు, సమర్పించిన వినతి పత్రాల ద్వారా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో, గత డిసెంబర్ నెలలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 13/04/2026 వ తేదీ నుండి 20/04/2026 వ తేదీ వరకు చేసిన చేనేతల ఆత్మగౌరవ దీక్ష (రిలే నిరాహార దీక్షలు) కు ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన లేకపోవడంతో ముందుగా ప్రభుత్వానికి చెప్పినట్టుగానే పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం, తాటిపర్తి గ్రామంలో పద్మశాలి చేనేత కళ్యాణ మండపం నందు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్, గుడిమెట్ల వీర్రాజు, కోమాకుల వీరబాబు ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నారు, కానీ రాత్రి భారీగా పోలీసులు మోహరించి కళ్యాణ మండపం తలుపులు బద్దలు కొట్టి ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేశారు, పిఠాపురం నియోజకవర్గం లో నిరసనలు దీక్షలు చేయడానికి వీలులేదని, పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అని పోలీసులు హెచ్చరించారు.
ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ మట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం లో ప్రజాస్వామ్యం లో భారత రాజ్యాంగ ఇక్కడ అమలు కాదా అని ప్రశ్నించారు, ప్రశ్నించడానికే పార్టీని పెట్టానన్న పవన్ కళ్యాణ్ చేనేతల ఆకలి సమస్యలపై శాంతియుత దీక్షలు చేపడితే ఎందుకు భయపడుతున్నారని, మీకు అధికారం వస్తే ప్రశ్నించకూడదా, ప్రశ్నిస్తే దుర్మార్గంగా పోలీసులతో అణచివేస్తారా, ప్రజా ఉద్యమాలు అణచివేస్తే మరింత తీవ్రతరం దాలుస్తాయని గుర్తు పెట్టుకోవాలని, ఈ ఉద్యమాన్ని రాష్ట్రస్థాయిలో తీవ్రతరం చేస్తామని, పిఠాపురం నియోజకవర్గంలో చేనేతలు, బి.సి ల యొక్క వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది తెలిపారు, పిఠాపురం పోలీసుల దుర్మార్గ వైఖరి, పిఠాపురం నియోజకవర్గం లో నిరసనలు దీక్షలు చేయడానికి వీలులేదన్న ప్రజాస్వామ్య విరుద్ధ వ్యాఖ్యలపై ఇక నుంచి చేనేత ఉద్యమమైన బీసీ ఉద్యమాన్నైనా పిఠాపురం కేంద్రం గానే ప్రారంభిస్తామని ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కును ఉపయోగించుకుని పోరాడుతామని చేతనైతే అడ్డుకోవాలని పోలీసులకు మీడియా సమక్షంలో సవాలు విసిరారు.
గత ఎనిమిది రోజులుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్న న్యాయమైన డిమాండ్లు
8 సంవత్సరాల నుంచి సహకార సంఘాలకు ఆప్కో మరియు ప్రభుత్వం చెల్లించవలసిన 203 కోట్ల రూపాయల బకాయిలను ఒకేసారి తక్షణమే చెల్లించాలని, చేనేత వృత్తి మనుగడ సాగించడానికి, చేనేత కార్మికుల ఆదాయం పెరగడానికి, గతంలో రద్దు చేసిన త్రిఫ్టు పథకం, పావలా వడ్డీ రుణ పథకం,యార్న్ సబ్సిడీ,30% రిబేటు, 2018 రుణమాఫీ పథకం, మార్కెటింగ్ ఇన్సెంటివ్ పథకాలను పునరుద్ధరించాలని, చేనేత సహకార సంఘాలకు ముడిసరుకు ఇచ్చి మరల చేనేత కార్మికులకు పని కల్పించాలని, 2018 తర్వాత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు కాబట్టి తక్షణమే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, రాష్ట్ర బడ్జెట్లో చేనేతలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది 1000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించాలని ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా గత ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన నేతన్న భరోసా 25 వేల రూపాయలు విడుదల చేయాలని అదేవిధంగా GST రియంబర్స్మెంట్ హామీలను నిలబెట్టుకోవాలని, చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తూ,నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు చేనేత కార్మికులు ఆకలితో ప్రమటించడానికి ప్రధానమైన కారణం ఆప్కో ఎండి రేఖ రాణిని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు, ఈ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వకంగా ఉన్నత అధికారులకు నివేదించిన నివేదికను అధికారులు సమస్యలు పరిష్కారానికి హామీ ఇస్తూ ఫెడరేషన్ అధ్యక్షుడు దుర్గా రమేష్ కి అందజేశారు, ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్, ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘాల జేఏసీ కన్వీనర్ అల్లక రాజు, లివరీ సంఘాల ఫెడరేషన్ చైర్మన్ దొంతంశెట్టి సత్య ప్రకాష్, గుడిమెట్ల వీర్రాజు, కోమాకుల వీరబాబు, అముజూరి చక్రధరరావు, నక్కిన విజయలక్ష్మి, పలివెల లక్ష్మి, ఇసుకపల్లి సత్యనారాయణ, జక్కిలింకి రమేష్ బాబు, కట్టా రాజబాబు,కాకి సత్తిరాజు, పచ్చారి సూర్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




