Pithapuram: పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో హుండీ లెక్కింపు

Pithapuram: పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహసంస్థానంలో హుండీ లెక్కింపు. దాదాపు రూ. 14 లక్షల ఆదాయం వచ్చినట్లు వెల్లడించిన దేవాదాయ శాఖ అధికారులు.

V. Ramakrishna, Pithapuram
Published on: 18 July 2026 7:06 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో హుండీ లెక్కింపు

పిఠాపురం: పిఠాపురం పట్టణం శ్రీపాద శ్రీవల్లభ మహసంస్థానం నందు 23.03.2026వ తేదీ నుండి ది.18.07.2026 వరకు హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.

ఈ హుండీ లెక్కింపు కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ వి.వెంకటేశ్వరరావు,వి.ఫణీంద్ర కుమార్ తనిఖీదారుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధ్యక్షతన కార్య నిర్వహణాధికారిణి సౌజన్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుండీ ద్వారా వచ్చిన సొమ్ము లెక్కింపు చేయగా వచ్చిన ఆదాయం.

రూ.13,99,743.00 ఆదాయం వచ్చిందని తెలియజేశారు.దీనిని ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ హుండీ లెక్కింపులో భజన బృందం మహిళలు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story