Pithapuram: చిత్రాడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు
Pithapuram: చిత్రాడ స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు, కలశాల పూజలు మరియు కోటిదీపోత్సవ విశేషాలను శ్రీ నారాయణ దత్తస్వామి వివరించారు.
Pithapuram: చిత్రాడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు
పిఠాపురం: పిఠాపురం మండలం చిత్రాడ గ్రామం శ్రీ నారాయణ దత్తస్వామి మాట్లాడుతూ చిత్రాడ గ్రామంలో స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయా నందు రాఖీ పౌర్ణమి సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా కలశాల పూజ విశేషంగా జరుగుతుందని 9 శుక్రవారాలు స్వామివారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని ప్రగాఢ నమ్మకం అని,అనేక చోట్ల నుండి నీరుని తీసుకొచ్చి కలశాల నింపి గ్రామం పాదయాత్ర చేసి ఆ స్వామి వారికి అభిషేకం చేస్తామని అన్నారు.
చిత్రాడ చరిత్ర ఏమిటంటే శ్రీపాదుల వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చిత్రాలు జరుగుతాయని అందుకని ఇక్కడ చిత్రాల వాడ అనే ఒక గ్రామం ఏర్పడుతుందని అప్పుడే తెలిపారని అన్నారు.ప్రతి శుక్రవారం సాయంకాలం 6 గం.ల నుండి కోటిదీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది.ఇప్పటి వరకు 493 కోట్ల దీపాలు నారాయణ దత్తా పీఠంలో వెలిగించడం జరిగింది.
2019 నుండి స్వామి వారికి పౌర్ణమి సేవా అనగా సర్వ పీడ నివారణ చేయగల హోమము తరువాత కొంతకాలానికి సహస్రదీపాలంకరణ సేవా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.ఇప్పటికీ 20 ఊర్ల నుండి 48 గ్రూపులు చొప్పున నెలకు 4 గ్రూపుల చొప్పున ఏర్పడి సంవత్సరం పొడవునా తెల్లవారుజామున 4 గం.లకు ప్రతిరోజు స్వామి వారికి అభిషేకము జరుగుతుంది.
ప్రతి సంవత్సరం కూడా మాఘ శుద్ధ దశమి రోజు స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవముగా జరుగుతుంది అని అన్నారు.అనంతరం భక్తులకు ఉచితంగా అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.




