Pithapuram: పి.రాయవరం మండలంలో ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన జనసేన శ్రేణులు

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పి.రాయవరంలో రాఖీ పండుగ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున ఆడపడుచులకు చీరలు కానుకగా పంపిణీ చేశారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 28 Aug 2026 5:40 PM IST
Pithapuram
X

Pithapuram: పి.రాయవరం మండలంలో ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన జనసేన శ్రేణులు

పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ రాఖీ పండుగ సందర్భంగా పిఠాపురం నియో జకవర్గం, పి.రాయవరం గ్రామంలో ఆడపడుచులకు చీర కానుకగా పంపిణీ చేయడం జరిగింది. మండల అధ్యక్షుడు వెన్న జగదీష్ మరియు వైస్ ప్రెసిడెంట్ నిమ్మన దుర్గాప్రసాద్ సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శెట్టిబలిజి కార్పొరేషన్ డైరెక్టర్ పెంకె జగదీష్ , పి.రాయవరం జనసేన పార్టీ పంచాయతీ ఇంచార్జ్ మాదేపల్లి పద్మావతి మరియు పి.రాయవరం నీటి సంఘం అధ్యక్షుడు కారపురెడ్డి కృష్ణ , వార్డ్ ఇంచార్జ్లు, బూత్ ఇన్చార్జిలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story