Pithapuram: పిఠాపురంలో పల్స్ పోలియో భారీ ర్యాలీ.. చర్చ్ సెంటర్‌లో మానవహారం!
Pithapuram: పిఠాపురంలో జూన్ 28న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై భారీ అవగాహన ర్యాలీ.
Pithapuram: పిఠాపురంలో పల్స్ పోలియో భారీ ర్యాలీ.. చర్చ్ సెంటర్‌లో మానవహారం!
పిఠాపురం: జూన్ 28, 2026 (ఆదివారం) నాడు నిర్వహించనున్న జాతీయ టీకా దినోత్సవం (పల్స్ పోలియో కార్యక్రమం) విజయవంతం చేయడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆజ్ఞానుసారం, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ మరియు యూపీహెచ్‌సీ మంగయ్యమ్మరావుపేట వైద్యాధికరి డాక్టర్ వై. వినయ్ ఆధ్వర్యంలో పిఠాపురంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ యూపీహెచ్‌సీ మంగయ్యమ్మరావుపేట నుండి ప్రారంభమై, పిఠాపురం మున్సిపల్ కార్యాలయం మీదుగా ప్రధాన రహదారులలో కొనసాగి, చర్చ్ సెంటర్ వద్ద మానవహారంగా నిర్వహించబడింది.
ర్యాలీలో పాల్గొన్న వారు ప్రజలకు ఈ క్రింది నినాదాల ద్వారా అవగాహన కల్పించారు:
నిండు జీవితానికి రెండు చుక్కలు
ఇప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించండి – పోలియో మహమ్మారిని తరిమికొట్టండి.
నిర్లక్ష్యం వద్దు – పోలియో చుక్కలు వేయించుట ముద్దు.
ప్రతిసారి రెండు పోలియో చుక్కలు వేయించండి – బిడ్డ బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయండి.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ జూన్ 28, 2026న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు కోరారు.
ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బంది, యూపీహెచ్‌సీ మంగయ్యమ్మరావుపేట వైద్యాధికారి డాక్టర్ వై. వినయ్, హెల్త్ అసిస్టెంట్ వై. రమేష్, డీఈఓ శివ, ఎల్.టి. అనూష, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సీఎంసీ నర్సింగ్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.




