Pithapuram: ఉప్పాడలో వరుస దొంగతనాల నిందితుడు అరెస్ట్!

Pithapuram: ఉప్పాడ, కొత్తపల్లి ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు గంగిరి అశోక్‌ను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేసి నగదు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 27 Aug 2026 5:48 PM IST
Pithapuram
X

Pithapuram: ఉప్పాడలో వరుస దొంగతనాల నిందితుడు అరెస్ట్!

పిఠాపురం: పిఠాపురం రూరల్ సర్కిల్ సర్కిల్పరిధిలోని ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్ మాట్లాడుతూ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిమితుల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక పాత నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల కథనం ప్రకారం రాత్రి ఈ నెల 15-08-2026 రాత్రి ఉప్పాడ సెంటర్‌లోని ఒక పాపులర్ వైన్స్ దుకాణం పైకప్పు సిమెంట్ రేకులు తొలగించి లోపలికి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి.సుమారు రూ.2,000 నగదు, రెండు పాత ట్యాబ్ లు , నాలుగు మొబైల్ ఫోన్లు దొంగిలించాడు.

అదే రాత్రి సమీపంలోని ఒక బార్బర్ షాపు, ఉప్పాడ డైలీ మార్కెట్‌లోని కిరాణా షాపు, అమీన్‌షాబ్ సెంటర్‌లోని చికెన్ షాపు మరియు హార్డ్‌వేర్ షాపుల పైకప్పు రేకులు తొలగించి నగదు దొంగతనాలకు పాల్పడ్డాడు.బాధితుల ఫిర్యాదు మేరకు యూ.కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కాకినాడ సబ్ డివిజన్ డీఎస్పీ పర్యవేక్షణలో, పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సూచనలతో కొత్తపల్లి పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో 11:30 గంటల ప్రాంతంలో ఉప్పాడ శ్రీ శ్రీనివాస సినిమా హాల్ వెనుక నిర్మాణంలో ఉన్న ఒక కాళీ బిల్డింగ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతని వద్ద నుండి రూ.7,000/- నగదు మరియు వివిధ కంపెనీలకు చెందిన 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.ఆరెస్ట్ అయిన నిందితుడిని బాపట్ల జిల్లా, చీరాల మండలం, ఈపూరుపాలెం గ్రామం, వాడబలిజ ప్రాంతానికి చెందిన గంగిరి అశోక్ గా గుర్తించారు.పోలీసుల విచారణలో నిందితుడు గంగిరి అశోక్ అలవాటు పడ్డ పాత నేరస్థుడని తేలింది.

ఇతనిపై గతంలో వివిధ జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో దాదాపు 13 దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి.అందులో చీరాల రూరల్, కొవ్వూరు టౌన్, రాజమండ్రి టౌన్, కొత్తపల్లి, తిరుచానూరు, ధవళేశ్వరం, తణుకు మరియు వేదుల్లపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేసులు ఉన్నాయి.నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పిఠాపురంలోని న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండలం ఎస్సై వెంకటేష్, మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story