Pithapuram: మెగా పిటీఎంపై పిఠాపురం విద్యార్థిని తల్లి లక్ష్మి ఆనందం!

Pithapuram: పిఠాపురంలో నిర్వహించిన మెగా పిటిఎంపై విద్యార్థిని తల్లి పక్కోతి లక్ష్మి కుమారి సంతోషం వ్యక్తం చేశారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 24 July 2026 5:58 PM IST
Pithapuram
X

Pithapuram: మెగా పిటీఎంపై పిఠాపురం విద్యార్థిని తల్లి లక్ష్మి ఆనందం!

Pithapuram: నా పేరు పక్కోతి లక్ష్మి కుమారి, మా ఊరు పిఠాపురం మండలం, జగ్గయ్య చెరువు. మా పాప ఇక్కడ పదవ తరగతి చదువుతోంది. పాఠశాలలో విద్యార్థుల చదువు చాలా బాగుంది మరియు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల భాగస్వామ్యం తో నిర్వహించే పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ ఎంతో సమర్థవంతంగా, చక్కగా జరుగుతోంది.

ఈ రోజు ఇక్కడికి వచ్చి మా పాప స్నేహితులను, వారి తల్లిదండ్రులను కలవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. పాఠశాలలో పిల్లలకు అందిస్తున్న భోజనం కూడా చాలా నాణ్యంగా, రుచిగా ఉంది.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పాఠశాలలో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు మరియు వసతులు ఏర్పాటు చేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాను కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story