Pithapuram: పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు

Pithapuram: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం (పాదగయ) హుండీ లెక్కింపు చేపట్టారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 30 Jun 2026 3:42 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు

Pithapuram: శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం(పాదగయ) వారి హుండీ లెక్కింపు కార్యక్రమం కాకినాడ జిల్లా తనిఖీదారు వడ్డీ ఫణీంద్ర కుమార్ మరియు కార్యనిర్వహణాధికారులు శ్రీ కర్రి సోమరాజు, వరిపల్లి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆలయ సహాయ కమీషనరు & కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆలయ ఏసీ & ఈవో మాట్లాడుతూ ది.31.03.2026 నుండి ది.30.06.2026 వరకు 92 రోజులకుగాను ఆలయ హుండీల ద్వారా 19,29,139/- రూపాయిలు మరియు అన్నదానం హుండీ ద్వారా 1,11,767/- వెరసి రూ. 20,40,906/-లు ఆదాయం వచ్చిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్త బృందం, బ్యాంకు సిబ్బంది, పోలీసు సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, అర్చకులు, పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story