Pithapuram: పిఠాపురం అన్నా క్యాంటీన్‌లో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని అన్నా క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ ఎస్.టి.వి. రాజేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 22 Jun 2026 3:15 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం అన్నా క్యాంటీన్‌లో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

Pithapuram: ఈ సందర్భంగా ఆయన సాధారణ లబ్ధిదారుడిగా టోకెన్ తీసుకుని అల్పాహారాన్ని స్వీకరించి, క్యాంటీన్‌లో అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, రుచి, పరిశుభ్రత ప్రమాణాలను స్వయంగా పరిశీలించారు.

అనంతరం క్యాంటీన్‌కు వచ్చిన లబ్ధిదారులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఫీడ్బ్యాక్ సేకరించారు. ఆహారం నాణ్యంగా ఉందా, సకాలంలో అందుతోందా, సిబ్బంది వ్యవహార శైలి ఎలా ఉందనే అంశాలపై వినియోగదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

తనిఖీ సందర్భంగా క్యాంటీన్ ప్రాంగణం, వంటశాల, భోజన వడ్డన ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ప్రతిరోజూ క్యాంటీన్ పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

అలాగే క్యాంటీన్‌కు వచ్చే ప్రజల నుండి నిరంతరం ఓపెన్ ఫీడ్బ్యాక్ సేకరించి, వారి సూచనల మేరకు సేవలను మరింత మెరుగుపరచాలని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడంలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.

పరిశుభ్రత ప్రమాణాలు, ఆహార నాణ్యత మరియు సేవల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించినట్లయితే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఎస్.టి.వి. రాజేశ్వరరావు హెచ్చరించారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story