Pithapuram: మూలపేట పాఠశాలపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు
Pithapuram: మూలపేట జడ్పీ హైస్కూల్‌పై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, సస్పెన్షన్ వేరే చోట పనిచేసినప్పుడే జరిగిందని హెచ్ఎం జి. శ్రీనివాస్ స్పష్టం చేశారు.
Pithapuram: మూలపేట పాఠశాలపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు
పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం మూలపేట గ్రామం మూలపేట శ్రీరాయవరపు అచ్యుతమ్మ జగన్నాధ రావు జిల్లా పరిషత్ ప్రధాన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శ్రీరాయవరపు అచ్యుతమ్మ జగన్నాధ రావు జిల్లా పరిషత్ ప్రధాన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.శ్రీనివాస్ మాట్లాడుతూ సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడు గతంలో తొండంగి మండలంలో పనిచేసిన సమయంలో లైంగిక వేధింపులు పాల్పడినట్లు నిర్ధారణ అయిందని కానీ కొంతమంది కావాలని మూలపేట స్కూల్లో జరిగినట్టు దీన్ని చిత్రీకరిస్తున్నారని,
ఈ సంఘటన ముందు ఆయన పని చేసిన స్కూల్లో జరిగిందని మూలపేట స్కూల్లో ఎటువంటి సంఘటనలు జరగలేదని ఈ స్కూలుకి మంచి రిప్యుటేషన్ ఉందని, నో అడ్మిషన్ బోర్డు పెట్టిన ప్రభుత్వ ప్లస్ టు పాఠశాలలో మాది మొదటిదని పిఠాపురం నియోజవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మమ్మల్ని మా స్కూల్ ని అభినందించడం జరిగిందని అటువంటి మంచి పేరు ఉన్న ఈ స్కూలుకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురామని దయచేసి రూమర్స్ నమ్మద్దని ఆవేదన వ్యక్తం చేశారు.




